అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో అగ్నిభూతమునకిది ప్రతీక.తమిళంలో " తిరువణ్ణామలై " అంటారు.స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము. కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. మార్చి 2022 లో 17వ తేదీ మధ్యాహ్నం 1-30 నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 12-40 వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి.
గిరి ప్రదక్షిణం 14 కి.మి దూరం ఉంటుంది. గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షిణ చేసే సమయంలో కొండ చుట్టూ రమణ మహర్షి ఆశ్రమం, శేషాద్రి స్వామి ఆశ్రమంతోపాటు మరి కొన్ని ఆశ్రమాలు కూడా కనిపిస్తాయి. ఆయా భక్తలు వారి వారి ఇష్టాను సారం అక్కడి నుంచి ప్రదక్షిణ ప్రారంభిస్తారు. కొందరు అరుణాచలేశ్వర ఆలయం రాజగోపురం నుంచి మొదలు పెడతారు. గిరి ప్రదక్షిణ లో మొత్తం 8 లింగాలు తప్పనిసరిగా దర్సించుకోవాలని చెప్తారు. అవి ఏమిటో ఇప్పడు చూద్దాం
అరుణాచలేశ్వరుని రాజగోపురం దగ్గిరగిరి ప్రదక్షిణ మొదలు పెట్టిన వారికి మొదట కనిపించేది ఇంద్రలింగం