బాత్‌రూంలో కాలుజారి పడిపోయినపుడు

మెట్లుజారి కింద పడ్డప్పుడు కాలు, తుంటి ఎముకలు విరిగిపోతాయి

ఎముకలు బలహీనపడినపుడు కూడా విరిగిపోతాయి

అలాంటప్పుడు వారిని ఎలా పడితే అలా తీసుకెళ్తే..

ఫ్రాక్చర్‌ తీవ్రత మరింత పెరుగుతుంది

ఫ్రాక్చర్‌ అయినపుడు రక్తస్రావం అయితే గాయమైన చోట శుభ్ర పరిచి కట్టు కట్టాలి

విరిగిన చోట కర్రబద్దలతో ఆధారం కల్పించాలి

జాగ్రత్తగా గట్టిగా కట్టును విరిగిన చోట కాకుండా అటు ఇటుగా కట్టాలి

ఎముక విరిగిన ప్రాంతం కిందిభాగంలో దిండు ఉంచాలి

నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే ఐస్‌ బ్యాగ్‌ పెట్టాలి