వీవో వీ23 ప్రో 5జీని లాంచ్ చేసి వీవో. బుధవారం వర్చువల్ ఈవెంట్ ద్వారా రిలీజ్ అయింది.

ఈ ఫోన్ తన బ్యాక్ ప్యానెల్ కలర్స్‌ను స్వయంగా మార్చుకోగలదు.

బ్యాక్ ప్యానెల్ పై ఉండే ఫ్లోరైట్ ఏజీ గ్లాస్ మీద సూర్య కిరణాలు లేదా ఇతర ఆర్టిఫిషియల్ యువీ కిరణాలు పడగానే మారిపోతుంది.

గోల్డెన్ కలర్‌లో ఉండే ఈ ఫోన్.. యూవీ లైట్స్ పడగానే బ్లూ కలర్‌లోకి మారిపోతుంది.

గోల్డెన్ కలర్‌లో ఉండే ఈ ఫోన్.. యూవీ లైట్స్ పడగానే బ్లూ కలర్‌లోకి మారిపోతుంది.

అలా సూర్యరశ్మి నుంచి తీసేసి పది నిమిషాలు అయినా అదే రంగులో ఉండిపోతుంది.

కలర్ ఛేంజింగ్ మెకానిజం కేవలం గోల్డెన్ వేరియంట్ లోనే అందుబాటులో ఉంది.

కెమెరా మాడ్యుల్ లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. వెనుక బాడీ మాత్రమే ఎండకు మారుతుంది.

VIVO V23 Pro 8GB RAMవేరియంట్ ఖరీదు రూ.38వేల 990గా ఉంది. అదే 12జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ.43వేల 990పలుకుతుంది.