మే 20 శుక్రవారం పలు భారీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఒకేసారి ఓటీటీలలో రిలీజ్ అవ్వనున్నాయి.

మోహన్ లాల్ 12th మ్యాన్‌ సినిమా డైరెక్ట్ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ లో రిలీజ్ అవుతుంది.

సిద్దార్థ్ నటించిన బాలీవుడ్ వెబ్ సిరీస్ ఎస్కేప్‌ లైవ్‌ డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ లో మే 20న రిలీజ్ అవుతుంది.

రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఇన్ని రోజులు థియేటర్లలో కలెక్షన్స్ కొల్లగొట్టి ఇప్పుడు జీ5లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవ్వనుంది.

చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ లో రానుంది.

శ్రీవిష్ణు భళా తందనాన సినిమా డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ లో మే 20 నుంచి స్ట్రీమ్ అవ్వబోతుంది.

ఎంతగానో వెయిట్ చేస్తున్న బాలీవుడ్ ఫేమస్ సిరీస్ పంచాయత్ సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ లో మే 20న రిలీజ్ అవ్వనుంది.

షాహిద్ కపూర్ నటించిన హిందీ జెర్సీ సినిమా నెట్‌ఫ్లిక్స్‌ లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.