ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు

ఉస్తాద్ హీరో రామ్ మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ మూవీతో 'ది వారియర్'గా వస్తున్నాడు. కృతిశెట్టి జంటగా  లింగుస్వామి డైరెక్షన్లో తెలుగు, తమిళ్ లో జులై 14న రిలీజ్ అవుతోంది 'ది వారియర్' మూవీ.

జులై 15న ప్రభుదేవా జీనిగా నటించిన కామెడీ సినిమా  'మై డియర్ భూతమ్' తెలుగు, తమిళ్ లో రిలీజ్ అవుతుంది.

సాయిపల్లవి లేడీ ఓరియెంటెడ్ మూవీ 'గార్గి' సినిమా కూడా జులై 15న థియేటర్లలో రిలీజ్ అవుతుంది. తెలుగు, తమిళ్, మలయాళంలో ఈ సినిమా రిలిజ్ అవుతుంది.

ఇండియన్ విమెన్ క్రికెట్ లో దాదాపు 25 సంవత్సరాలుగా సేవలు అందించిన మాజీ కెప్టెన్ మిధాలి రాజ్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిన సినిమా 'శభాష్ మిథు'. తాప్సీ లీడ్ రోల్ లో చేసిన 'శభాష్ మిథు' మూవీ జులై 15న థియేటర్స్ లోకి రానుంది.

తెలుగులో విష్వక్ సేన్ హీరోగా వచ్చి సక్సెస్ అయిన 'హిట్' మూవీని హిందీలో అదే పేరుతో రీమేక్ చేశారు. రాజ్ కుమార్ రావ్, సాన్యా మల్హోత్రా లీడ్ రోల్స్ లో ప్లే చేస్తున్న ఈ రీమేక్ మర్డర్ మిస్టరీ డ్రామా జులై 15న రిలీజ్ అవ్వబోతుంది.