ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలు

శింబు, సిద్ధి ఇదాని నటించిన 'ముత్తు' సినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా సెప్టెంబర్ 15 విడుదల కానుంది.

సుధీర్ బాబు, కృతిశెట్టి జంటగా నటించిన  'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది.

కిరణ్ అబ్బవరం, సంజన, సోను ఠాకూర్ నటించిన 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' సినిమా సెప్టెంబర్ 16న రిలీజ్ కానుంది.

రెజీనా, నివేదా థామస్ కలిసి నటించిన శాకిని డాకిని సినిమా సెప్టెంబర్ 16న విడుదలవ్వనుంది.

కిచ్చ సుదీప్, మడోన్నా సెబాస్టియన్ నటించిన K3- కోటికొక్కడు సినిమా పాన్ ఇండియా వైడ్ సెప్టెంబర్ 16న రిలీజ్ అవుతుంది.

మరో రెండు చిన్న సినిమాలు  నేను కేరాఫ్ నువ్వు, అంఅః  సినిమాలు కూడా సెప్టెంబర్ 16 న రానున్నాయి.