ఈ వారం థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..

సంతోష్‌ శోభన్‌ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన 'లైక్‌ షేర్‌ సబ్‌స్క్రైబ్‌' సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది. ఫుల్ కామెడీగా ఈ సినిమా ఉండబోతుంది.

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా కొత్త దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన 'ఊర్వశివో రాక్షసివో' సినిమా నవంబర్ 4న రిలీజ్ కాబోతుంది. రొమాంటిక్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది.

నందు, రష్మీ జంటగా తెరకెక్కిన 'బొమ్మ బ్లాక్ బస్టర్' సినిమా కూడా నవంబర్ 4న రిలీజ్ అవనుంది. ఈ సినిమా ప్రమోషన్స్ చాలా కొత్తగా చేయడంతో సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

కొత్త హీరో జైద్ ఖాన్, సోనాల్ హీరోయిన్ గా తెరకెక్కిన 'బనారస్' సినిమా నవంబర్ 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో, దండుపాళ్యం బ్యాచ్‌తో దండుపాళ్యం బ్యాచ్ డైరెక్టర్ తెరకెక్కించిన 'తగ్గేదేలే' సినిమా కూడా నవంబర్ 4న రిలీజ్ కానుంది.

నందిత శ్వేతా ముఖ్య పాత్రలో తెరకెక్కిన 'జెట్టి' సినిమా నవంబర్ 4న విడుదల కానుంది.

జాన్వీ కపూర్ మెయిన్ లీడ్ లో మలయాళ సినిమా హెలెన్ రీమేక్ గా తెరకెక్కిన 'మిలీ' సినిమా నవంబర్ 4న రిలీజ్ కానుంది.