సత్యదేవ్ హీరోగా తమన్నా, మేఘ ఆకాష్, కావ్య శెట్టిలు హీరోయిన్స్ గా తెరకెక్కిన గుర్తుందా శీతాకాలం సినిమా అనేక సార్లు వాయిదా పడి డిసెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.
విశ్వక్‌సేన్, ఆయేష్‌ఖాన్, ప్రియ వడ్లమాని, చైతన్యరావు, వికాస్ వశిష్ట ప్రధానపాత్రల్లో తెరకెక్కిన సినిమా 'ముఖచిత్రం' డిసెంబర్ 9న థియేటర్స్ లోకి రానుంది.
త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా, మధుబాల ముఖ్యపాత్రలో నటించిన ‘ప్రేమదేశం’ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ కానుంది.
యష్ పూరి, స్టెఫీ పటేల్ జంటగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందిన 94వ సినిమా ‘చెప్పాలని ఉంది’-‘ఒక మాతృభాష కథ’ సినిమా డిసెంబర్ 9న రిలీజ్ అవ్వనుంది.
రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్లుగా బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ‘లెహరాయి’ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి రానుంది.
తల్లాడ సాయి కృష్ణ దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించిన ‘నమస్తే సేట్ జీ’ సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
సాయి రోనక్, అంకిత సాహా, బిస్మినాస్ హీరో హీరోయిన్లుగా నటించిన 'రాజయోగం' సినిమా డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకి రానుంది.
అప్సరా రాణి, నైనా గంగూలీ మెయిన్ లీడ్స్ లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డేంజరస్’ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది.
దేశంలోనే అతి పెద్ద లాజిస్టిక్ కంపెనీల్లో ఒకటైన వీఆర్‌ఎల్ వ్యవస్థాపకుడు విజయ్ శంకేశ్వర్ బయోపిక్ గా తెరకెక్కిన ‘విజయానంద్’ సినిమా డిసెంబర్ 9న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.
ఈ వారం మొత్తంగా దాదాపు 10 సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి.