ఆరోగ్యవంతమైన జీవితానికి తగినంత నిద్ర అవసరం.
ఇలా చేస్తే మంచి నిద్ర మీ సొంతం అంటున్నారు నిపుణులు.
రాత్రి పడుకునే ముందు ఓ గ్లాస్ గోరు వెచ్చని పాలు తాగితే..
పగటి అలసట నుంచి ఉపశమనం లభించి నిద్రపడుతుంది.
పడుకునే ముందు నూనెతో అరికాళ్లను 2-5 నిమిషాల పాటు మసాజ్ చేస్తే..
రిలాక్స్ గా అనిపించి నిద్ర వస్తుంది.
నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో స్నానం వల్ల..
అలసట తొలగి మనసు ఉల్లాసంగా మారి ప్రశాంతంగా నిద్రపోతారు.