దీర్ఘ‌కాలిక నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతుంటే..మాన‌సిక‌, శారీర‌క స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది..

కాబట్టి హాయిగా నిద్రపోవాలి.. అలా నిద్రపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..

శ‌రీరానికి చెమ‌ట‌ప‌ట్టేలా వ్యాయామం చేయాలి. నిద్ర‌పోయే స‌మ‌యానికి 2,3 గంట‌ల ముందే వ్యాయామాన్ని ముగించాలి.

లైట్ క‌ళ్ల‌పై ప‌డితే నిద్ర ప‌ట్ట‌దు. కాబట్టి బెడ్‌రూం చీక‌టిగా ఉండేలా చూసుకోవాలి.

రాత్రిపూట టీవీ లేదా మొబైల్ స్క్రీన్ చూడ‌డం మానుకోవాలి. ఎల‌క్ట్రానిక్ గాడ్జెట్లు మెద‌డుపై ప్ర‌భావాన్ని చూపుతాయి. దీంతో నిద్ర పట్టదు..

మ‌న‌స్సును విశ్రాంతిగా ఉంచుకోవాలి. దీనికోసం ధ్యానం చేయాలి. ఇష్ట‌మైన పాటలు విన‌డం,బుక్స్ చ‌ద‌వ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారి వెంట‌నే నిద్ర‌ప‌డుతుంది.

కాఫీ, టీ, సిగ‌రెట్లు నిద్ర‌కు అత్యంత శ‌త్రువులు.. నిద్ర‌లేమితో బాధ‌ప‌డుతున్న‌వారు వీటికి క‌చ్చితంగా దూరంగా ఉండాలి.

బెడ్‌రూంలో మంద‌పాటి క‌ర్టెన్లు వాడాలి. నిద్రలేమి రోగులు స్లీప్ మాస్కులు వాడాల‌ని వైద్యులు సూచిస్తుంటారు.