కలర్ డ్రింక్ తాగుతున్నప్పుడు దంతాల మీద మరకలు పడకుండా నిరోధించడానికి స్ట్రాను ఉపయోగించాలి. 

నిమ్మ, ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించి రెగ్యులర్ గా బ్రష్ చేయాలి.

నిమ్మ సహజంగా సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటుంది.

ఈ సిట్రిక్ యాసిడ్ కు ఉప్పు చేర్చడం వల్ల ఈ రెండింటి మిశ్రం సహజంగానే దంతాలు తళతళలాడేలా చేస్తాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బ్రకోలీ, క్యారెట్, గుమ్మడి వంటి వాటిలో విటమిన్ కె సమృద్ధిగా లభిస్తుంది.

ఈ కూరగాయలు పచ్చిగా తినడం వల్ల పళ్ల మధ్య సహజంగానే మసాజ్ చేస్తాయి.

దాంతో పళ్ల మద్య శుభ్రం అవుతుంది. 

దంతాలను తెల్లగా మార్చడానికి సహాయపడతాయి.

రెండు నెలకొకసారి టూత్ బ్రష్ ను మార్చాలి.

ఒక నిర్ణీత కాలం తర్వాత టూత్ బ్రష్ యొక్క బ్రిస్టల్స్ చాలా కఠినంగా మారుతాయి.

దాంతో దంతాలపైన ఎనామిల్ పాడవుతుంది. 

మింట్ టూత్ పేస్టును ఉపయోగించటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పుదీనాతో తయారు చేసిన టూత్ పేస్ట్ దంతాలను తెల్లగా మార్చడానికి అద్భుతంగా సహాయపడుతుంది.