శేషాద్రికొండ దిగువన, ఏడుకొండలకు వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధం. దీన్నే  చక్రతీర్థం లేదా ఆళ్వార్ తీర్థం అని కూడా అంటారు

తిరుపతి కపిల తీర్థంలోని  శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి..

సాక్షాత్తు పరమశివుడే.. శ్రీ కపిలేశ్వరస్వామివారిగా పూజలందుకుంటున్నాడు..

కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజు స్వామి భక్తులకు.. మకర వాహానంపై దర్శనమిచ్చారు..

మకరం అంటే.. మొసలి గంగాదేవికి వాహనం..

పరమశివుడి శిరస్సులో కొలువైన తల్లి..గంగమ్మ

మకరం తపస్సు చేసి.. శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి అంటే  శ్రీ కపిలేశ్వరస్వామివారి వాహనమైంది..

మకరం.. జీవప్రకృతికి ఉదాహరణ...

భగవంతుని ఆశ్రయిస్తే..జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు అంటారు పండితులు..