ఇండియాలో రీ రిలీజ్ అవుతున్న  ‘టైటానిక్’

ప్రపంచంలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో ఒకటి ‘టైటానిక్’

జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. లియోనార్డో డికాప్రియో, కెట్ విన్‌స్లెట్ జంటగా నటించారు

1997, డిసెంబర్ 19న విడుదలై, అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అప్పట్లోనే 2 బిలియన్ డాలర్లు వసూలు చేసింది

ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుంది

సినిమా విడుదలై పాతికేళ్లు పూర్తైన సందర్భంగా ఇప్పుడీ చిత్రం ఇండియాలో మళ్లీ విడుదలవుతోంది

అది కూడా 4కే రెజల్యూషన్, 3డీలో. ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది

ఫిబ్రవరి 10 నుంచి ఈ చిత్రాన్ని ప్రధాన నగరాల్లో ప్రదర్శిస్తారు

గతంలో 2012, 2017లో కూడా 3డీలో రీ రిలీజైంది, ఎన్నిసార్లు విడుదలైనా అపూర్వ ఆదరణ దక్కింది

వెండితెరపై మిస్సవకూడని టైమ్ లెస్ క్లాసిక్ చిత్రమిది