వేసవి వేడికి చెమట రూపంలో ఎక్కవ నీరు శరీరం నుండి బయటకు పోతుంది..

వేసవిలో ద్రవాహారాలు ఎక్కువగా తీసుకోవాలి..అంటూ నీరు ఎక్కువగా ఉండే పండ్లు తినాలి..

పుచ్చకాయ లో ఉండే లైకోపీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి6, సి, పొటాషియం, అమైనో యాసిడ్లు వంటివి వేసివిలో ఆరోగ్యాన్ని కాపాడతాయి..

తాటి ముంజ‌లు శ‌రీరంలో ఉన్న వేడి త‌గ్గిపోతుంది. శ‌రీరం చ‌ల్లబడుతుంది. శ‌రీరంలో  నీటి శాతం త‌గ్గకుండా చూస్తాయి.

కీర దోస : చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శ‌రీరం చ‌ల్లబరుస్తుంది.  డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

ద్రాక్షల్లో విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల వీటిని వేస‌విలో తింటే శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. అలాగే శ‌రీరం చల్లగా ఉంటుంది.

స‌పోటా పండ్లను తింటే తక్షణ శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. ఒంట్లో ఉన్న నీరు త‌గ్గిపోకుండా ఉంటుంది..

మజ్జిగ  : రోజులో తగినన్ని ఎక్కువ సార్లు మజ్జిగ తాగటం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి జలుబు,దగ్గు వంటి సాధారణ సమస్యలు దరిచేరకుండా చూస్తుంది.

పుదీనా : పెరుగులో కొద్దిగా పుదీనాను చేసి రైతాగా తీసుకోవచ్చు. వేసవిలో శరీర వేడిని తగ్గించటంలో ఉపయోగపడుతుంది.