టాలీవుడ్‌లో ఇప్పటికే బాహుబలి చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇక మరికొన్ని సీక్వెల్ చిత్రాలు త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. మరి వాటిలో ఇప్పటికే క్రేజ్ తెచ్చుకున్న కొన్ని సీక్వెల్ చిత్రాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.

కార్తికేయ-2 యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో వచ్చిన మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘కార్తికేయ’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. దీంతో ఇప్పుడు కార్తికేయ-2  సీక్వెల్ మూవీ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.

హిట్-2 నేచురల్ స్టార్ నాని నిర్మాతగా చేసిన ‘హిట్’ సినిమాలో మాస్ హీరో విశ్వక్ సేన్ తన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలవగా, ఇప్పుడు హిట్-2 సినిమాను సీక్వెల్‌గా రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోగా అడివి శేష్ నటిస్తున్నాడు.

గూఢచారి-2 యంగ్ హీరో అడివి శేష్ నటించిన గూఢచారి బాక్సాఫీస్ వద్ద ట్రెమెండస్ హిట్ అందుకుంది. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చి ప్రేక్షకులను అలరించింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా గూఢచారి-2 చిత్రాన్ని తెరకెక్కిస్తోంది చిత్ర యూనిట్.

పుష్ప-2 స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-1 బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని చిత్ర యూనిట్ తొలి భాగంలోనే ప్రకటించింది.

బింబిసార-2 నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘బింబిసార’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్ ఖచ్చితంగా ఉంటుందని హీరోతో పాటు దర్శకుడు వశిష్ఠ కూడా ప్రకటించాడు.