ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన ఆటల్లో ఫుట్‭బాల్ ప్రథమ స్థానంలో ఉంటుంది. అలాంటి ఆటలో ప్రపంచం మొత్తం మేమకమయ్యే ఫిఫా ప్రపంచ కప్ వచ్చిందంటే.. ఒక్క ఫుట్‭బాల్ అభిమానులే కాదు, యావత్ క్రీఢీ ప్రపంచం ఉర్రూతలూగిపోతుంది. అలాంటి ప్రపంచ కప్ గురించి కొన్ని సంగతు తెలుసుకుందామా?

ప్రస్తుతం ఫిఫా ప్రపంచ కప్ ఖతార్ దేశంలో జరుగుతోంది. ఈ దేశంలో జరగడం ఇదే మొదటిసారి.

మొదటిసారి ఫిఫా ప్రపంచ కప్ 1930లో జరిగింది. దీనికి ఉరుగ్వే ఆతిధ్యమిచ్చింది.

అతి ఎక్కువ ఫిఫా ప్రపంచ కప్‭లు బ్రెజిల్ గెలుచుకుంది. ఆ దేశానికి 5 కప్‭లు వచ్చాయి.

అతి ఎక్కువగా ఐదు ఫిఫా ప్రపంచ కప్‭లు ఆడిన ఆటగాడిగా పోర్చుగల్ మిరాకల్ రొనార్డో రికార్డు సృష్టించారు.

ఈ ఏడాది నిర్వహిస్తున్న ప్రపంచ కప్‭లో గతంలో కంటే కాస్త చిన్న బంతిని ఉపయోగిస్తున్నారు.

ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచ కప్‭లలో బ్రెజిల్ పాల్గొంది. మరే దేశానికి ఈ ఘనత లేదు.

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో 1942-1946 మధ్య ఫిఫా క్రీడలు జరగలేదు.

మ్యాచ్ ప్రారంభం కాగానే అత్యంత ఫాస్ట్‭గా, కేవలం 11 సెకన్లలోనే టర్కీ ఆటగాడు హకన్ సుకుర్ చేశాడు. 2002 నాటి ప్రపంచ కప్‭లో జరిగింది.

ఒకసారి పికిల్స్ అనే కుక్క ప్రపంచ కప్ ట్రోఫీని దొంగించిందట. తర్వాత దొరికింది లెండి.

ఖతార్ మొదటి డిమౌంటబుల్ వరల్డ్ కప్ స్టేడియంను నిర్మించింది.