ప్రపంచ బాక్సాఫీస్ వద్ద అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలు

అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'దంగల్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 2024 కోట్లు వసూలు చేసింది. చైనాలో అత్యధిక కలెక్షన్లని సాధించింది ఈ సినిమా.

ప్రభాస్ 'బాహుబలి 2' సినిమా ప్రపంచవ్యాప్తంగా 1810 కోట్లు కలెక్ట్ చేసింది.

చరణ్, తారక్ లు కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే 900 కోట్లు కలెక్ట్ చేసి 1000 కోట్ల వైపు పరిగెత్తుతుంది.

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'భజరంగీ భాయిజాన్' సినిమా 500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఆ తర్వాత చైనాలో విడుదలై మరో 400 కోట్లు వసూలు చేసి మొత్తం 900 కోట్లు కలెక్ట్ చేసింది.

అమీర్ ఖాన్ నిర్మాతగా, అతిథి పాత్రలో చేసిన 'సీక్రెట్ సూపర్ స్టార్' సినిమా ఇండియాలో కేవలం 80 కోట్లు మాత్రమే వసూలు చేసి చైనాలో 800 కోట్లకు పైగా వసూలు చేసింది.

అమీర్ ఖాన్ 'PK' సినిమా ప్రపంచ వ్యాప్తంగా 740 కోట్లని వసూలు చేసింది.

రజినీకాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'రోబో 2.0' సినిమా 700 కోట్లకు పైగా వసూలు చేసింది.

ప్రభాస్ 'బాహుబలి 1' సినిమా 650 కోట్లు వసూలు చేసింది.

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన 'సుల్తాన్' సినిమా 600 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది

రణబీర్ కపూర్ హీరోగా నటించిన సంజయ్ దత్ బయోపిక్ 'సంజు' 580 కోట్లు కలెక్ట్ చేసింది.