సైబర్ వలలో పడకుండా ఉండాలంటే తప్పక పాటించాల్సిన జాగ్రత్తలు
పర్సనల్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం మంచిది.
అపరిచిత లింకులు ఎట్టి పరిస్థితిలోనూ క్లిక్ చేయవద్దు.
వార్షికోత్సవ ఆఫర్లు, కేంద్ర ప్రభుత్వం ఆఫర్లు అంటూ వచ్చే కాల్స్, మెసేజ్ లకు స్పందించొద్దు.
వ్యక్తిగత వివరాలు, బ్యాంకు పాస్ వర్డ్స్, ఇతర కీలకమైన సమాచారం ఫోన్ లో ఉంచకపోవడమే ఉత్తమం.
వాట్సాప్ స్టేటస్, డీపీల్లో మీ ఫోటోలు ఉంచకపోవడమే ఉత్తమం.
పాస్వర్డ్ రెగ్యులర్ గా మారుస్తూ ఉండాలి.
తెలియని వ్యక్తులు కాల్ చేసి..
మెయిల్ ఐడీ, బ్యాంకు అకౌంట్ వివరాలు, చిరునామా..
బ్యాంకు డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు అడిగినప్పుడు స్పందించకూడదు.