కింద కూర్చుని భోజనం చేయడం మంచిదా? కాదా? 

మారుతున్న కాలాన్ని బట్టి భోజనం చేసే విధానం కూడా మారుతూ వస్తోంది.

కొంతమంది సెల్‌ఫోన్‌, టీవీ చూస్తూ సోఫా, కుర్చీలో కూర్చొని భోజనం చేస్తుంటారు. 

కానీ ఒకప్పుడు భోజనం నేల మీద కూర్చొని తినేవారు.

నిజానికి నేల మీద కూర్చొని భోజనం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది.

కింద కూర్చుని భోజనం చేయడం వల్ల బోలెడు లాభాలు.

కింద కూర్చొని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

కింద కూర్చొని తినడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

భోజనం తినడానికి ముందుకు వంగినప్పుడు పొట్ట కండరాలు చురుగ్గా పనిచేసి పొట్టలో ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి.

దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.

శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి కొవ్వు తగ్గుతుంది.

కింద కూర్చుని తినడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఇలా తినడం వల్ల వెన్నెముక నిటారుగా ఉంటుంది.

కండరాలు, కీళ్ల నొప్పులు, తగ్గడంతో పాటు శరీరం అంతా రక్తప్రసరణ జరుగుతుంది.