‘ఉగాది’పచ్చడితో ఆరోగ్య ప్రయోజనాలే కాదు ఈ ‘ఆరు రుచులు మనిషి జీవితానికి చెప్పే అర్థాలు’ కూడా ఉన్నాయని పండితులు చెబుతున్నారు..

తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు..ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి ప్రతిగా ఉంది..

తీపి (బెల్లం): ఆనందానికీ, సంతోషానికీ, సంతృప్తికీ సూచన.

చేదు (వేపపువ్వు): బాధ,దుఃఖానికి సంకేతం..జీవితంలో సుఖాలే కాదు కష్టాలూ ఉంటాయని వాటిని ఎదుర్కోవాలని సూచిస్తుంది..

ఉప్పు : రుచికి మూలబింధువు.ఇది ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది..

పులుపు (చింతపండు): ఓర్పుగా,నేర్పుగా ఉండాలని సూచిస్తుంది..

వగరు (మామిడి): కొత్త సవాళ్లు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను గెలుస్తు ముందకెళ్లాలని సూచిస్తుంది.

కారం (మిరప,లేదా మిరియాలు): అసహన పరిస్థితులు.ఈ రుచి సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులకు సంకేతంగా నిలుస్తుంది.

జీవితం అంటే ఈ ఆరు రుచుల కలయిక..వీటిని స్వీకరిస్తేనే జీవితానికి ఓ అర్థం ఉంటుందని పండగ పచ్చడిలోని అర్థం..పరమార్థం..