బ్రిటన్ శాస్త్రవేత్తలు కనీ వినీ ఎరుగని అద్భుతం చేశారు..!

శరీరం బయట తొలిసారి ల్యాబ్‌లో రక్తాన్ని తయారు చేశారు..

ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరానికి సరఫరా చేసే ఎర్ర రక్త కణాలపై దృష్టి సారించారు పరిశోధకులు..

ముందుగా ఎర్ర రక్త కణాలుగా మారే మూల కణాలను సేకరించి వాటిని ల్యాబ్‌లో పెద్ద మొత్తంలో పెరిగేలా చేశారు.

అలా ల్యాబ్ లో మూడు వారాలకు 5 లక్షల మూల కణాలు.. 5 వేల కోట్ల ఎర్ర రక్త కణాలుగా మారాయి.

ఆ ఎర్రరక్త కణాలను శుద్ధి చేయగా, 1500 కోట్ల ఎర్ర రక్త కణాలు ట్రాన్స్‌ప్లాంట్‌కు పనికొచ్చాయి.

ట్రయల్స్‌లో భాగంగా తొలిసారిగా ఇద్దరికి ఈ రక్తాన్ని ఎక్కించి పరీక్షిస్తున్నారు..

కొన్ని గ్రూప్‌ల రక్తం చాలా అరుదని.. ఆ బ్లడ్‌ గ్రూప్‌లు ఉన్నవారికి రక్తం దొరక్కపోతే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు బ్రిటన్‌కు చెందిన ఎన్‌హెచ్‌ఎస్‌ బ్లడ్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ మెడికల్‌ డైరెక్టర్‌ ఫారుక్‌ షా.

అందుకే రక్త దానంపై ఆధారపడకుండా ఉండేందుకు ఈ ప్రయోగం చేపట్టామని తెలిపారు.