వడదెబ్బ నుంచి ఇలా తప్పించుకోండి..
అత్యంత వేడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే సమయాల్లో ఇంట్లోనే ఉండాలి.
వదులుగా ఉండే లైట్ కలర్ దుస్తులు మాత్రమే ధరించాలి.
నీరు బాగా తాగాలి.
ఆల్కహాల్, కెఫిన్ కు వీలైనంత దూరంగా ఉండాలి.
బయటకు వెళ్లాల్సి వస్తే నీడ ఉన్న ప్రదేశాల్లోనే కూర్చోవాలి.
చల్లగా ఉండటానికి ఫ్యాన్లు లేదా ఏసీలు వాడాలి.
ఎండలో తిరగకపోవడమే మంచిది.
ఎండలో తిరగాల్సి వస్తే క్యాప్ లేదా గొడుగు వాడాలి.
అధిక ఉష్ణోగ్రతల్లో పనిచేయకుండా జాగ్రత్త పడాలి.
వడదెబ్బ లేదా హీట్ స్ట్రోక్ అధిక ఉష్ణోగ్రతలలో ఎక్కువసేపు గడపడం వల్ల తగులుతుంది.
వేడి వాతావరణంలో శారీరక శ్రమ చేస్తే శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి పెరుగుతుంది.
ఈ పరిస్థితుల్లో వడదెబ్బ ముప్పు ఎక్కువ.
వడదెబ్బ ప్రాణాంతకమైనది.