ఆల్కహాల్.. కేవలం కిక్కిచ్చే డ్రింక్ మాత్రమే కాదు. డైలీ లైఫ్ లో దాంతో మనకు చాలా అవసరాలు తీరతాయి. అది ఇథనాల్ కావొచ్చు. ఇథైల్ ఎసిటేట్ లేదా ఎసిటోన్ కావొచ్చు. డైలీ లైఫ్ లో ఇందనంగా వాడుకునేంత కెపాసిటీ ఉంది ఆల్కహాల్‌కు. వైజ్ఞానిక ప్రయోగాలకు కూడా బాగా హెల్ప్ అవుతుంది.

యాంటిసెప్టిక్‌గా

సర్జికల్ బ్లేడ్స్, నీడిల్స్ లాంటి వాటిని ఇథనాల్ (ఆల్కహాల్)తో క్లీన్ చేయొచ్చు.

క్లీనింగ్

ఆల్కహాల్‌లో యాంటీమైక్రోబయాలు గుణాలు ఉండటంతో క్లీనింగ్ పర్పస్‌కు బెస్ట్ ఛాయీస్ అని చెప్పుకోవచ్చు.

మరకలు పోవడానికి

బట్టలకు అంటిన ఎటువంటి మరకైనా సరే ఆల్కహాల్ తో క్లీన్ చేసుకోవచ్చు.

ఇందనం

చాలా దేశాల్లో ఇథనాల్ ను ఆటోమొబైల్ ఇందనంగా వాడుతుంటారు. కాలుష్యాన్ని తగ్గించి గ్రేటర్ ఎనర్జీని జనరేట్ చేస్తుంది.

యాంటిసెప్టిక్‌గా

సర్జికల్ బ్లేడ్స్, నీడిల్స్ లాంటి వాటిని ఇథనాల్ (ఆల్కహాల్)తో క్లీన్ చేయొచ్చు.

దీపాల్లోకి చమురుగా

ల్యాబొరేటరీల్లోని ల్యాంప్స్ లో చమురుగా ఆల్కహాల్ నే ఉపయోగిస్తారు.

నైల్ పాలిష్ రిమూవర్

గోళ్లపై ఉన్న రంగును తొలగించడానికి నైల్ పాలిష్ రిమూవర్ గా ఆల్కహాల్ వాడొచ్చు.

రాకెట్ ఇందనంగా

ఇథైల్ ఆల్కహాల్ ను రాకెట్ ఇందనాల్లో మిశ్రమంగా వాడతారు. లిక్విడ్ ఆక్సిజన్ ను నీటిలో కలిపి ఆల్కహాల్ తో జత చేస్తారు.

శానిటేషన్

ఇటీవలి రోజుల్లో కరోనా లాంటి మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి శానిటైజర్ గానూ ఆల్కహాల్ ను ఎక్కువగా వాడుతున్నారు.