కూరగాయలు,పండ్ల తొక్కలు సౌందర్య సాధనాలుగా ఉపయోగపడతయాని తెలుసా..?

సొర, బీర, దోస కాయల చెక్కులను వేయించి ఉప్పు, పచ్చిమిర్చి, చింత పండుగుజ్జు, పల్లీలు లేదా నువ్వుల పొడి వేసి పచ్చడి చేస్తే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.

పుచ్చకాయలో ఎర్రటి భాగాన్ని మాత్రమే తిని తక్కిందంతా పడేస్తుంటాం. కానీ తొక్కతో రోటి పచ్చడి లేదా జామ్‌, స్మూతీస్‌ చేసుకోవచ్చు.

మామిడిపండు చెక్కుతో సహా జ్యూస్‌ చేయడం వల్ల మరిన్ని పోషకాలూ, పీచుపదార్థం శరీరానికి అందుతాయని చెబుతున్నారు నిపుణులు.

బంగాళాదుంప చెక్కును మెత్తగా నూరి ప్యాక్‌లా వేసి పావుగంట తర్వాత కడిగేస్తే ముఖం తేటగా ఉంటుంది. కళ్లకు అలసట తగ్గుతుంది.

నారింజ తొక్కలు నొప్పులు, పుండ్లు, గాయాలు త్వరగా మాడిపోయేలా చేస్తాయి. పుండ్లు, గాయాలు ఉన్నచోట నారింజ తొక్కను రుద్దితే త్వరగా మానిపోతాయి.

మొటిమలున్న వారు నారింజ తొక్కను రోజు మొటిమలపై రోజు రుద్దుతూ ఉంటే త్వరగా తగ్గిపోతాయి. ఈ తొక్కలను చర్మంపై రాస్తే చర్మం నిగారింపు వస్తుంది.చర్మాన్ని మృదువుగా చేస్తుంది

అరటిపండు తొక్కను మాస్క్‌గా వేయడం వల్ల ముఖానికి మెరుపు వస్తుంది. అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది..కొత్తవి రాకుండా చేస్తుంది..

కానీ ఒక్క జాగ్రత్త.. పండ్లు, కూరగాయలను మగ్గడానికి, త్వరగా పాడైపోకుండా తాజాగా కనిపించడానికి రసాయనాలు ఉపయోగిస్తారు కనుక వాటిని ఉప్పునీళ్లతో శుభ్రంగా కడిగి మాత్రమే ఉపయోగించాలి..