శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

శాకాహారంలో అనేక రకాల పోషకాలు శరీరానికి అందటమేకాక త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి.

శాకాహారం జీర్ణమయినంత సులభంగా మాంసాహారం జీర్ణం కాదు.

ఆకుకూరలు, కాయగూరల్లో అన్ని పోషకాలు, ప్రొటీన్లు సంపూర్ణంగా లభిస్తాయంటున్నారు నిపుణులు.

మాంసాహారం తీసుకోవటం వల్ల ఆకలి మందగించడంతో పాటు కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.

మొలకెత్తిన పెసర్లు, శనగలు వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభించి.. తరచూ వీటిని తీసుకోవడం వల్ల ఎంతో మేలు కలుగుతాయి.

వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది.

రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. నీరసం, అలసట తగ్గుతుంది.

నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.

అధిక బరువు, మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు రాత్రి ఆహారంలో అన్నం కాకుండా గోధుమ పుల్కాలు, జొన్న రొట్టె తినడం మంచిది.

శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.