వేసవిలో కారు ప్రయాణమా? ఈ జాగ్రత్తలు మస్ట్

అధిక ఉష్ణోగ్రతలకు కొన్ని సందర్భాల్లో కారు టైరు పేలిపోతుంది.

ఇంజిన్ ఓవర్ హీట్ అయ్యి ఒక్కసారిగా మంటలు రావొచ్చు.

ఇలాంటివి జరక్కుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచన.

మనకు ఏసీ ఎలాగో, కారుకు కూడా కూలెంట్ అలాగే.

కాబట్టి ప్రయాణానికి ముందే కారు కూలెంట్ లెవల్ చెక్ చేసుకోవాలి.

కారు టైర్‌లో తగిన మోతాదులోనే గాలి నింపాలి.

ఎక్కువ గాలి నింపితే రోడ్డుపై ఉన్న వేడికి టైర్‌లో ఉండే ప్రెజర్ పెరిగిపోయి టైర్ పేలే అవకాశం ఉంది.

కారు ప్రయాణంలో బ్యాటరీ, ఎలక్ట్రిక్ సిస్టమ్ చాలా ముఖ్యం.

అలాగే ఎలక్ట్రిక్ వైరింగ్ లో ఎలాంటి లోపాలు లేకుండా చేసుకోవాలి.

ఎండాకాలం కాబట్టి కారులో కచ్చితంగా ఏసీ అవసరం ఉంటుంది.

కాబట్టి ఏసీ గ్యాస్ లీక్ కాకుండా చూసుకోవాలి.

అలాగే కండెన్సర్, ఫిల్టర్‌లను శుభ్రపరుచుకోవాలి.