భారతదేశంలోని ఈ విచిత్ర దేవాలయాల  గురించి తెలుసా..?!

రాజస్థాన్ మహేందిపుర్ బాలాజీ దేవాలయం : వేలాదిమంది భక్తులు దెయ్యాల్ని వదిలించుకోవడానికి  ఇక్కడికి వస్తుంటారు.

కామఖ్య దేవి ఆలయం,అస్సాం  : అమ్మవారి యోని పడిన ప్రాంతం.యోని రూపంలో శిల. దేవతకు రుతుక్రమం.ఆ మూడు రోజులు దేవాలయం మూసేస్తారు..

దేవ్ జీ మహరాజ్ మందిర్, మధ్య ప్రదేశ్:  దెయ్యాలను, దుష్ట శక్తులను వదిలించుకోవడానికి ఇక్కడికొస్తారు. ప్రతి ఏటా 'భూత్ మేళా' లేదా 'దెయ్యాల ఉత్సవం' నిర్వహిస్తుంటారు.

4.కాలభైరవనాథ్ దేవాలయం,వారణాసి: కాల భైరవ్ నాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం నోట్లో మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు.

కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ: ప్రతి ఏటా 7 రోజుల భరణి పండుగ చేస్తారు.మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని రక్తం కారేలా తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు.

స్తంభేశ్వర్ మహదేవ్,గుజరాత్: అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం. సముద్రంలో మాయం అయి ప్రత్యక్షమయ్యే దేవాలయం. రోజులో కొన్ని గంటలు మాత్రమే దేవాలయ దర్శనం ఉంటుంది.

బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్: బ్రహ్మ ఆలయం. పాలరాయి ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. దాతలు, భక్తుల పేర్లతో కనిపిస్తాయి.

రుంద్‌నాథ్‌ మహదేవ్‌ ఆలయం గుజరాత్‌ ,సూరత్‌ : రామ్‌నాథ్‌ ఘేలా శ్మశాన వాటికలో ఉన్న ఈ శివుడికి భక్తులు బతికున్న పీతలతో అభిషేకం చేస్తారు.

కేరళ, షేమత్ శ్రీ సుబ్రహ్మణ్యం స్వామి ఆలయం : స్వామికి భక్తులు చాక్లెట్లు భక్తితో సమర్పించుకుంటారు. పువ్వులు..పండ్లు ఈ దేవాలయాలోకి తీసుకెళ్లరు..తీసుకెళ్లనివ్వరు.చాక్లెట్లే ప్రసాదం..ముడుపుగా చాక్లెట్లే తులాభారం.