నీ ఇల్లు బంగారం కాను అంటారే..అది నిజంగా నిజమైంది. ఓ వ్యక్తి ఏకంగా బంగారంతో ఇల్లు కట్టేశాడు.కేజీఎఫ్ గనుల్లో బంగారమంతా ఇక్కడే ఉందా? అన్నట్లుగా బంగారంతో నిండిపోయిందా ఇల్లు..!!

రియల్‌ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించిన ఎంగ్యూయెన్ వాన్ ట్రూంగ్ అనే వ్యాపారి ఏకంగా బంగారంతో ఇల్లు కట్టేశారు ఆ వ్యాపారవేత్త..

కాన్‌థో నగరంలో ఈ బంగారు భవనాన్ని నిర్మించుకున్నారు ఎంగ్యూయెన్  వాన్‌ ట్రూంగ్.

వాన్‌ ట్రూంగ్ ఇంట్లో ప్రతీది బంగారమే. ఇంటి గోడలు, పైకప్పును బంగారంతో తాపడం చేయించారు.

ఇంట్లో గ్యాస్ స్టవ్‌తో సహా కిచెన్, హాల్, మెట్లు అన్నీ బంగారమే..

వియత్నాం వచ్చే విదేశీ పర్యాటకులకు ఇప్పుడీ ఇల్లు కూడా  ఓ టూరింగ్ స్పాట్‌లా మారిపోయింది..

బంగారపు ఇల్లు, అందులోని భారీ విగ్రహాలు చూసి దేశ,విదేశ పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు..వీడియోలు,ఫోటోలు,సెల్ఫీలతో సందడి సందడి చేస్తున్నారు.

వియత్నాం దేశానికే ప్రత్యేక ఆకర్షణగా మారిన ఈ స్వర్ణ భవంతిని నిర్మించడానికి మూడేళ్లు కష్టపడిన వాన్‌ ట్రూంగ్

ప్రపంచంలో మరెక్కడా బంగారపు ఇల్లు లేదని తెలుసుకున్న వాన్ ట్రూంగ్...తన ఆస్తికి బంగారంలాంటి చిహ్నంగా...స్వర్ణపు కాంతులీనే నివాసాన్ని నిర్మించుకున్నారు.

ఆరేళ్ల క్రితం వచ్చిన ఆయన ఆలోచన ఇలా బంగారపు ఇంటి రూపంలో మెరిసిపోతోంది..