రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమా జర్నీ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

రవిబాబు తెరకెక్కించిన ‘నువ్విలా’ సినిమాతో విజయ్ దేవరకొండ తెరంగేట్రం చేశాడు.

శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించాడు ఈ హీరో.

నాని నటించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాలో మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన ‘పెళ్ళిచూపులు’ సినిమాతో విజయ్ దేవరకొండ హీరోగా మారాడు.

సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో కల్ట్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని, సెన్సేషనల్ స్టార్‌గా మారిపోయాడు.

సావిత్రి బయోపిక్ మూవీ ‘మహానటి’ చిత్రంలోనూ సపోర్టింగ్ రోల్‌లో సమంత పక్కన చేశాడు.

‘గీత గోవిందం’ సినిమాతో క్లాస్ ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు  ఈ హీరో.

‘నోటా’ సినిమాలో పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్‌గా కనిపించాడు.

‘టాక్సీవాలా’ మూవీతో మరో మంచి హిట్ అందుకున్నాడు.

భారీ క్రేజ్‌తో వచ్చిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఫ్లాప్ మూవీగా మారడంతో విజయ్ పని అయిపోయిందని చాలా మంది అన్నారు.

‘వరల్డ్ ఫేమస్ లవర్’ సినిమాలో నలుగురు భామలతో రొమాన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు.

ప్రస్తుతం ‘లైగర్’ అనే పాన్ ఇండియా మూవీని దర్శకుడు పూరీ జగన్నాధ్ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తూ అందరి చూపులు తనవైపు తిప్పుకున్నాడు.

ఇవి మాత్రమే కాకుండా పలు సినిమాల్లో కేమియో రోల్స్ చేసిన విజయ్ దేవరకొండ, మరోసారి పూరీతో కలిసి ‘జనగణమన’ అనే సినిమాలో నటిస్తున్నాడు.