రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ గత సినిమాల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో స్టార్ డైరెక్టర్స్‌తో వరుస సినిమాలని లైన్లో పెడుతున్నాడు.

ప్రస్తుతం విజయ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ అవ్వనుంది.

'లైగర్' తర్వాత సుకుమార్‌తో సినిమాని అనౌన్స్ చేశాడు. సుకుమార్ 'పుష్ప 2' అయిపోయాక విజయ్ - సుకుమార్ సినిమా మొదలవ్వనుంది.

పూరి జగన్నాధ్‌తో 'జనగణమన' అనే మరో సినిమాని కూడా ఓకే చేసినట్టు తెలుస్తుంది. సుకుమార్ లేట్ అయితే ముందు ఈ సినిమానే మొదలు పెట్టే ఛాన్సులు ఉన్నాయి.

నిన్నుకోరి, మజిలీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీస్ తీసిన డైరెక్టర్ శివ నిర్వాణతో కూడా సినిమాని అనౌన్స్ చేశాడు. ఇది మొదలవ్వడానికి సమయం పట్టొచ్చు.

స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో కూడా సినిమా ఉండొచ్చు అని టాక్ నడుస్తుంది. ఇప్పటికే దీని గురించి చర్చలు జరిగాయి.

ఇక బాలీవుడ్ లో కరణ్ జోహార్ నిర్మాతగా ఒక సినిమాని లాక్ చేసి పెట్టుకున్నాడని బాలీవుడ్ మీడియా అంటుంది.