టీమ్‌ఇండియా క్రికెటర్ మురళీ విజయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

మురళీ విజయ్‌కు ప్రస్తుతం 38ఏళ్లు.

చివరిగా 2018 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో పెర్త్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడాడు.

ఆ మ్యాచ్‌ తర్వాత జట్టులో విజయ్ చోటు కోల్పోయాడు.

మళ్లీ టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకోలేక పోయాడు.

2008-09 సీజన్‌లో విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు.

2013 నుంచి 2018 మధ్య ఐదేళ్ల పాటు భారత్ టెస్ట్ జట్టులో కీలక సభ్యుడుగా కొనసాగాడు. 

61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20ల్లో భారత్ జట్టు తరపున ఆడాడు. 

టెస్టుల్లో అతను 38.28 సగటుతో 3982 పరుగులు చేశాడు.

17 వన్డేల్లో 339 పరుగులు, తొమ్మిది టీ20 మ్యాచ్‌లలో 169 పరుగులు చేశాడు. 

టెస్టుల్లో 12 సెంచరీలు, 15 అర్థ సెంచరీలు ఉన్నాయి. 

టెస్టుల్లో మురళీ విజయ్ అత్యధిక స్కోరు 167.

మురళి విజయ్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టనున్నాడు.