మన హీరోల క్రేజ్.. హీరో ఫోజులతో వినాయకుడి విగ్రహాలు..

ఇటీవల మన సినిమాలు దేశవ్యాప్తంగా బాగా క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో RRR, పుష్ప సినిమాలు బాగా పాపులర్ అయ్యాయి. ఈ సినిమాల్లోని మేనరిజమ్స్ జనాలకి బాగా కనెక్ట్ అయింది.

గతంలోనే వినాయకుడిని మన ఫేవరెట్ హీరోలు, క్రికెటర్ల ఫోజులతో తయారు చేశారు.

ఈ సారి పుష్ప అల్లుఅర్జున్, RRR లో ఎన్టీఆర్, చరణ్ ఫోజులతో వినాయకుడిని తయారుచేశారు. తమిళనాడులో రజినీకాంత్ జైలర్ పోజుతో వినాయకుడిని తయారుచేశారు.

ఇలా మన హీరోల ఫోజులతో వినాయకుడి విగ్రహాలని తయారుచేయడంతో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.