మానసిక ‘ఒత్తిడి’తో సతమతమవుతున్నారా..?

ఒత్తిడితో పలు ఆరోగ్య సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్న మానసిక నిపుణులు..

ఒత్తిడిని జయించాలంటే..  ఏం చేయాలి..?

ఒత్తిడి జయించాటానికి ‘జస్ట్ కళ్లు మూసుకోండి’.. అని చెబుతున్న మానసిక నిపుణులు..

కళ్లు మూసుకుని..మీ మనోనేత్రాన్ని తెరవండి…’ ‘ఊహల ఊయల’లో విహరించమంటున్న నిపుణులు..

నచ్చిన వస్తువుల్ని..మీకు నచ్చిన ప్రదేశాలను తలచుకోండి. మీకు నచ్చినట్లుగా ఊహించుకోండి...

చూసే చూపు, ఊహించుకునే విధానం ఒత్తిడి,  ఆందోళనను తగ్గించడంతోపాటు సుఖంగా నిద్రపోవడానికి ఉపకరిస్తుంది..

మనసు బాగోలేనప్పుడు.. ఆందోళనగా ఉన్నప్పుడు తేలికైన రంగులను ఊహించుకోండి.

ఆకుపచ్చ, నీలం, తెలుపు వంటి రంగులు పాత ఆలోచనల నుంచి విశ్రాంతిని ఇస్తాయని చెబుతున్నారు నిపుణులు.

సూర్యోదయంలో విహరిస్తున్నట్లుగా ఊహించుకోండి..

గాలి స్పర్శను అనుభూతి చెందుతున్నట్లుగా ఊహించుకోండి..

పచ్చని ప్రకృతి మధ్యలో విహరిస్తున్నట్లు ఊహించుకోండి..

రంగు రంగుల పూలపై పడుకున్నట్టు.. ఊహించుకోండి..

చక్కటి పూలను వాసన చూస్తున్నట్టు.. ఊహించుకోండి..

స్వచ్చమైన నీటిలో జలకాలాడుతున్నట్లు ఊహించుకోండి..చల్లటి నీరు శరీరానికి తాకి గిలిగింతలు పెడుతుంటే ఒత్తిడి హుష్ కాకి అంటూ ఎగిరిపోతుంది..