మనిషి శరీరానికి విటమిన్-ఈ చాలా అవసరం.

ఇమ్యూనిటీ పెరగాలన్నా, మతిమరుపు దరిచేరకుండా ఉండాలన్నా, జుట్టు రాలకుండా ఉండేందుకు, వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా ఉండాలంటే విటమిన్-ఈ అవసరం. 

విటమిన్-ఈ లభించే ఆహారాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

పొద్దు తిరుగుడు గింజల్లో విటమిన్-ఈ పుష్కలంగా ఉంటుంది. 

ప్రతి రోజూ 20 గ్రాముల పొద్దు తిరుగుడు విత్తనాలను తింటే రోజుకు శరీరానికి కావాల్సిన విటమిన్-ఈ నలభై శాతం అందుతుంది. 

ఆకుకూరల్లో పోషక విలువలు ఏదో ఒక రూపంలో తినడం అలవాటు చేసుకోవాలి. వారానికి రెండు సార్లు తింటే విటమిన్-ఈ లభిస్తుంది.

ప్రతిరాత్రి పూట బాదం గింజలను నీళ్లలో నానబెట్టుకుని పొద్దున్నే తింటే మంచిది.

వీటి వల్ల చర్మం ముడుతలు పడవు. వయసుతో వచ్చే వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. చర్మం కాంతివంతంగా మారుతుంది.

ఆహారంలో వెజిటెబుల్ ఆయిల్స్ మారుస్తూ ఉపయోగించాలి. నెలలో ఒక ఆయిల్ వాడితే మరో నెలలో మరో ఆయిల్ వాడుకోవటం చేయాలి.

ఇలా చేయటం వల్ల విటమిన్ ఇ పుష్కలంగా శరీరానికి అందుతుంది. 

పొద్దు తిరుగుడు నూనె, ఆలివ్ అయిల్, కనోలా ఆయిల్ వంటి వాటితో బహుళ ప్రయోజనాలు శరీరానికి కలుగుతాయి.