నడక చక్కటి, సహజమైన వ్యాయామం. జంజాటాలేవీ లేకుండా ఎప్పుడైనా, ఎక్కడైనా చెయ్యటానికి వీలైన, తేలికైన వ్యాయామం. అందుకే నడక అందరికీ మంచిది, మధుమేహులకు మరీ మంచిదని వైద్యరంగం స్పష్టంగా చెబుతోంది. మరి నడక వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

నడక శారీరక సామర్థ్యానికే కాదు, రోగనిరోధకశక్తిని పెంచి రకరకాల జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది.

గుండె సమర్థంగా పనిచేస్తుంది. గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

గుండె సమర్థంగా పనిచేస్తుంది. గుండెపోటు రాకుండా కాపాడుతుంది.

మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) పెరుగుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. రక్తంలో గ్లూకోజు స్థాయి తగ్గుతుంది.

శరీర బరువు తగ్గుతుంది. మానసిక కుంగుబాటు, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. కంటినిండా నిద్ర పడుతుంది.

పెద్దపేగు క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ వంటి క్యాన్సర్ల ముప్పు తగ్గుతుంది. కీళ్లు, ఎముకలు దృఢమవుతాయి.

నీరసం, అలసట, నిస్సత్తువ తగ్గుతాయి. ఆత్మ విశ్వాసం, శారీరక సామర్థ్యం పుంజుకుంటాయి.

అన్నింటికన్నా మించి.. మానసిక ఉల్లాసం కలుగుతుంది. నడక మూలంగా కొత్త స్నేహాలు ఏర్పడతాయి. కొత్త హుషారు వస్తుంది.