గూగుల్ పే యూజర్లకు వార్నింగ్.. ఈ యాప్స్ యమ డేంజర్

గూగుల్ పే ద్వారా ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో ఫోన్‌లో స్క్రీన్ షేరింగ్ యాప్‌లను వాడొద్దు.

వాటిని ఓపెన్ చేసి వదిలేయొద్దు.

ఆ యాప్స్ తో యూజర్ల బ్యాంకు ఖాతా వివరాలు సేకరిస్తున్న సైబర్ క్రిమినల్స్.

స్క్రీన్ షేరింగ్ యాప్స్‌తో మరో చోటు నుంచి ఇతరులు మీ ఫోన్‌ను తమ అదుపులోకి తీసుకోవచ్చు.

ఎనీ డెస్క్, టీమ్ వ్యూయర్ వంటివి ఎక్కువగా ఇందుకోసం వినియోగిస్తుంటారు.

స్క్రీన్ షేరింగ్ యాప్‌లు వాడొద్దని గూగుల్ పే అలర్ట్.

యూపీఐ యాప్స్ (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం) ద్వారా పేమెంట్స్ చేస్తున్న వారు సైతం అలర్ట్ గా ఉండాల్సిందే.

యాప్ ద్వారా పేమెంట్లు చేస్తున్నప్పుడు ఫోన్‌లోని స్క్రీన్ షేరింగ్ యాప్స్ వాడొద్దు. 

థర్డ్ పార్టీ యాప్‌లు ఇన్‌స్టాల్ చేసుకోమని గూగుల్ పే ఎప్పుడూ కోరదు.