జాగ్రత్త.. గుండెపోటు సంకేతాలివే..

తరచుగా అజీర్ణం సమస్య అనిపిస్తే జాగ్రత్త వహించాలి. 

గుండె జబ్బులకు ఇది ప్రథమ సంకేతంగా భావించాలి. 

అజీర్ణం వల్ల కడుపులో మంట, చాతీలో మంటగా అనిపిస్తే గుండెకు సంబంధించిన సమస్యగా గుర్తుంచుకోవాలి. 

గుండెపోటు వచ్చే సమయంలో చాతీలో నొప్పి ఇతర భాగాలకు కూడా వ్యాపిస్తుంది. 

చాతిలో భారం, అదనపు ఒత్తిడి ఎక్కువగా గుండెపోటుకు చెందిన సూచనగా తెలుసుకోవాలి.

గుండెపోటు వస్తుందని చెప్పే సంకేతాల్లో వికారం, కడుపు ఉబ్బరం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. 

పొత్తికడుపులో ఉబ్బరంగా అనిపిస్తుంది. 

గ్యాస్ సమస్యగా అనుకుంటే పొరపాటు పడినట్లే. 

నీరసం, బలహీనంగా అనిపిస్తే కూడా తేలిగ్గా తీసుకోవద్దు. 

శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగకపోతే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. 

ఆ సమయంలో కచ్చితంగా వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.

నడుస్తున్నప్పుడు మోకాలి వెనుక భాగంలో, పాదాల్లో నొప్పి వస్తుంటే అజాగ్రత్తగా ఉండొద్దు. 

వ్యాయామం చేసేటప్పుడు నొప్పి వస్తే కూడా అప్రమత్తం అవ్వాలి. 

తక్షణమే వైద్యులను సంప్రదించాలి. 

ఇలా గుండె జబ్బు సంకేతాలు వచ్చినప్పుడు చికిత్స తీసుకుంటేనే ప్రాణాలకు ముప్పు వాటిల్లదు.