మనిషి బ్రతకటానికి మూలాధారమైన నీరు.. శరీరానికి తగినంత అందించాల్సిన అవసరం ఉంది.

శరీర అవయవాల పనితీరు మెరుగుపడాలంటే, డీ హైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుకునేందుకు నీరు తాగటం చాలా అవసరం.

మూత్రపిండాలు ఒక రోజులో 20 నుండి 28 లీటర్ల నీళ్ళని ఫిల్టర్ చేయగలవు. 

నీరు ఎక్కువగా తాగినట్లైతే ఎలేక్ట్రోలైట్స్ కూడా ఎక్కువగా శరీరంలో చేరి.. సెల్స్ వాపుకు గురి అవుతాయి.

దాహం వేస్తున్న సమయంలో, చెమట ఎక్కువగా పట్టిన సందర్భంలో నీటిని తాగటం మంచిది. 

మహిళలు ప్రతిరోజూ 2.7 లీటర్లు. పురుషులు 3.7 లీటర్లు తాగాలని సూచిస్తున్నారు.

ప్రెగ్నెంట్ వుమన్స్, బ్రెస్ట్ ఫీడింగ్ వుమన్స్ అయితే.. కనీసం 3 లీటర్ల నీళ్లు తీసుకోవాలని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. 

ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే ఆకుకూరలు, పండ్లను ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

వేసవి సమయంలో రోజుకు 4లీటర్ల వరకు నీరు త్రాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మనిషి బ్రతకటానికి మూలాధారమైన నీరు.. శరీరానికి తగినంత అందించాల్సిన అవసరం ఉంది.