రోజంతా టీవీలు (LCD), ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్స్ చూస్తున్నారా? 

చాలా ప్రమాదం అంటున్న డాక్టర్లు.

రోజంతా టీవీలు, ఫోన్లు, ల్యాప్ టాప్‌లు చూడొద్దంటున్న వైద్య నిపుణులు.

వీటిలోని బ్లూలైట్(నీలి కాంతి) కంటిచూపు, నిద్రలేమితో పాటు చర్మంపై ప్రభావం చూపిస్తుందని డెర్మటాలజిస్టుల హెచ్చరిక.

బ్లూలైట్ వల్ల చర్మం పునరుత్పత్తి తగ్గుతుందని అధ్యయనంలో వెల్లడి.

ఫలితంగా చర్మం మీద ముడతలు, నల్లని మచ్చలు వస్తాయి.

చర్మం పాలిపోతుంది. పొడిబారుతుంది.

చర్మాన్ని రక్షించుకోకపోతే ముసలి ఛాయలు త్వరగా వచ్చే అవకాశం.

రోజంతా టీవీలు, ఫోన్లు, ల్యాప్ టాప్స్ చూడటం తగ్గించుకోవాలి.

బ్లూలైట్ చాలా శక్తిని విడుదల చేస్తుంది. 

ఇంటి లోపల ఉన్నప్పుడు కూడా సన్‌స్క్రీన్ వాడాలి.

ఇది మన చర్మాన్ని రక్షించుకోవడానికి ఉత్తమ మార్గం.

సన్‌స్క్రీన్‌లలోని SPF కంటెంట్ చర్మాన్ని హానికరమైన కాంతి నుండి రక్షిస్తుంది.