ఆకలి ఉన్నప్పుడు ఆహారం తినడం లేదా?

ఆకలి సహజమైన ప్రక్రియ.

ఆకలి వేసినప్పుడు తినకుండా ఉండటం చాలాకష్టం. 

అయితే కొందరు ఆకలిని నిర్లక్ష్యం చేస్తారు. 

తర్వాత తిందాంలే అని ఆకలి మందగించే వరకు తినకుండా ఉంటారు. 

ఇలా చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. 

వేళకు భోజనం చేయకపోతే శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరిగిపోతాయి.

తర్వాత భోజనం చేసేటప్పుడు తెలియకుండానే ఎక్కువ తింటారు. 

దీంతో బరువు పెరిగే అవకాశం ఉంది. 

అలాగే శరీరంలో షుగర్ లెవల్స్ పడిపోయే ప్రమాదం ఉంది.

ఆకలిగా ఉన్నప్పుడు మెదడు పనితీరు తగ్గిపోతుంది. 

దీంతో సరిగ్గా ఆలోచించలేరు. 

జ్ఞాపకశక్తి తగ్గడంతో పాటు ఏకాగ్రతను కోల్పోతారు.