నార్కో అనాలసిస్ అనేది గ్రీకు పదమైన నార్కో (అనెస్థీషియా అని అర్థం) నుంచి వచ్చింది.
ఈ పరీక్షలో భాగంగా వ్యక్తి శరీరంలోకి ఓ ఔషధాన్ని (సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్) ఎక్కిస్తారు.
దీన్నే ట్రూత్ సీరం అనికూడా అంటారు.
ఆ వ్యక్తి వయస్సు, ఆరోగ్యం, భౌతిక స్థితి ఆధారంగా ఔషధ డోసును ఇస్తారు.
ఇది ఇచ్చిన కొన్ని సెకన్లలోనే ఆ వ్యక్తి స్పృహ కోల్పోతాడు.
ఈ సమయంలో వ్యక్తి నాడీ వ్యవస్థను పరమాణు స్థాయిలో ప్రభావితం చేస్తారు.
ఆ సమయంలో దర్యాప్తు అధికారులు అడిగే ప్రశ్నలకు నిందితుడు తేలికగా సమాధానాలు వెల్లడిస్తాడు.
స్పృహలో ఉన్నప్పుడు చెప్పని విషయాలను స్వేచ్ఛగా బహిరంగపరుస్తాడు.
ఆ సమయంలో అతడి పల్స్, బీపీని నిపుణులు అనుక్షణం పర్యవేక్షిస్తారు.
ఒకవేళ అవి పడిపోతున్నట్లు గ్రహిస్తే.. వెంటనే నిందితుడికి ఆక్సిజన్ అందిస్తారు.
పాలిగ్రాఫ్, నార్కో పరీక్షలను చేయడానికి ఆ వ్యక్తి అంగీకారం తప్పనిసరి.
వ్యక్తి అంగీకారం లేకుండా బ్రెయిన్ మ్యాపింగ్, పాలిగ్రాఫ్, నార్కో అనాలిసిస్ టెస్టులను నిర్వహించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఉంది.