తుమ్ములు ఎందుకు వస్తాయి?

అసలు తుమ్ములు రావడానికి గల కారణాలేంటి?

దుమ్ము, ధూళి, పొగ, ఇంకా ఇతర సూక్ష్మకణాలు..

నాసికా రంధ్రంలోకి ప్రవేశించి చిరాకు కలిగించడంతో తుమ్ములు వస్తాయి. 

ఇవి ముక్కులోని డస్ట్ ను క్లియర్ చేస్తాయి. 

ముక్కుకి బ్యాక్టీరియా, బగ్ ల నుంచి రక్షణ ఇస్తాయి. 

తుమ్మడం ద్వారా ముక్కులోని సూక్ష్మజీవులు బయటికివెళతాయి. 

ఏవైనా వ్యాధులు ఉన్నపుడు తుమ్ముల ద్వారా ఆ వ్యాధి ఇతరులకు సంక్రమించే ప్రమాదం ఉంది. 

అందుకని తుమ్మేటప్పుడు చేతిని అడ్డుపెట్టుకోవాలి. 

కొన్నిసార్లు ఈ తుమ్ములు ప్రమాదకరంగా కూడా మారుతాయి. 

కొన్ని సీజన్లలో ఆరోగ్య సమస్యల కారణంగా తుమ్ములు అధికంగా వస్తాయి.

అలాంటప్పుడు ముక్కులో రక్తస్రావం జరిగే ప్రమాదం ఉంది.

అటువంటి సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

ఇంకా ఎట్టి పరిస్థితిలోనూ తుమ్మును ఆపుకోకూడదు. 

అది చాలా ప్రమాదకరం అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.