కార్వా చౌత్ గురించి తెలుసా

ఉత్తరాదిలో ఎక్కువ మంది జరుపుకొనే పండుగ ఇది. ఈ ఏడాది అక్టోబర్ 13న కార్వా చౌత్ జరగనుంది

ఇది మహిళల ప్రత్యేకం. ఎంతో సంప్రదాయబద్ధంగా జరుపుకొంటారు

ఈ రోజు మహిళలు సూర్యోదయం నుంచి చంద్రోదయం వరకు ఉపవాసం ఉంటారు

భర్త దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా ఉండాలని మహిళలు కార్వా చౌత్ పాటిస్తారు

సూర్యోదయం తర్వాత నుంచి చంద్రోదయం వరకు మంచి నీళ్లు కూడా తాగరు

చంద్రోదయం తర్వాత, ప్రత్యేక పూజలు చేసి ఉపవాస దీక్ష విరమిస్తారు

ఆ తర్వాతే నీళ్లు, ఆహారం తీసుకుంటారు. ప్రత్యేకంగా వండిన సర్గి అనే పదార్థాన్ని తింటారు

ఈ వేడుకలో భాగంగా జల్లెడతో చంద్రుడిని చూసి, తర్వాత భర్త ముఖాన్ని చూస్తారు

గర్భిణులు కార్వా చౌత్ పాటించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు