ప్రపంచంలో నీళ్ల తర్వాత ఎక్కువగా తాగే పదార్థం టీ

ముందుగా తేయాకును పండించింది..  ప్రపంచానికి ఎగుమతి చేసింది చైనానే

ఆ తర్వాత ఆంగ్లేయులు ఇండియాలోని అసోంలో పండించారు

చైనాలో ఇప్పటికీ తేయాకులతో చేసిన టీని మాత్రమే తాగుతారు

ఇండియాతో పాటు చాలా దేశాలలో పాలతో కలిసి టీ తీసుకుంటారు

టీ నీళ్లలో పాలను కలపడం వెనుక కూడా ఓ కారణం ఉందట

అప్పట్లో మొదట మట్టి కప్పులలో టీని సేవించేవారు

ఆ తర్వాత చైనాతో పాటు ఆంగ్లేయులు పింగాణీ కప్పులలో తీసుకొనేవారు

కేవలం టీనీళ్లను కప్పులలో పోస్తే ఆ వేడికి ఆ కప్పులు పగిలిపోయేవి

దీంతో కప్పులో ముందు పాలు పోసి టీ కలపి వేడి తగ్గించేవారు

ఆ రుచి నచ్చడం.. ఆ తర్వాత చక్కర వంటివి కూడా తోడయ్యాయి

అప్పుడు ఆంగ్లేయుల మాదిరిగానే ఇప్పటికీ ఇండియా ఫాలో అవుతుంది