పుచ్చకాయను తగిన మోతాదులో మధుమేహులు ఆహారంగా తీసుకోవచ్చు.
యాపిల్ : యాపిల్ లో ఉండే విటమిన్ సి, డైల్యూటెడ్ ఫైబర్, యాంటీ క్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దీంతో మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది.
పియర్ పండు : మధుమేహ రోగులకు సూచించదగిన మరో ఉత్తమమైన పండుగా పియర్ ను చెప్పవచ్చు. రోజుకు ఒక పండు తీసుకోవచ్చు..
అవకాడో : అవొకాడోలో ఉండే ఆరోగ్యకరకొవ్వులు, పొటాషియం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉండేలా చేస్తుంది.
దానిమ్మ : దానిమ్మలో జీఐ 18గా ఉంటుంది. అలాగే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెరస్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
డయాబెటిస్ ఉన్నవారు బొప్పాయిని కచ్చితంగా తినాలి.హానికరమైన ఫ్రీరాడికల్స్ నుంచి షుగర్ వ్యాధిగ్రస్తులను రక్షించే ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్‌ను తగ్గిస్తాయి.
నిమ్మకాయ : సిట్రస్ జాతికి చెందిన నిమ్మకాయలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలోని చక్కెరస్థాయిలను నియంత్రణలో ఉంచుతాయి.
జామ కాయ : షుగర్ వ్యాధికి జామకాయ ఎంతో మంచి ఔషధంగా చెప్పవచ్చు. జామలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
కివీస్ : విటమిన్ సీ, ఫైబర్, పొటాషియం, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కివీస్‌లో అధికంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కివీస్ తినడం వల్ల డయాబెటిస్ తీవ్రత తగ్గుతుంది.