విమానంలో ఏ సీట్లో కూర్చుంటే సేఫ్టీ ఎక్కువంటే..!

విమానంలో భధ్రతాపరంగా చూస్తే విండో సీటు అంత సేఫ్ కాదన్న నిపుణులు.

మూడు సీట్లు ఉన్న వరుసలో అటు విండో సీటు, ఇటు చివరి సీటు కాకుండా..

మధ్యలో కూర్చుంటే ప్రమాదాలు జరిగినపుడు క్షేమంగా ఉండే అవకాశాలెక్కువ.

విమానం ప్రమాదానికి గురైన సందర్భాలలో..

మిగతా సీట్లలో కూర్చున్న వారితో పోలిస్తే..

మధ్య సీటులో కూర్చున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలెక్కువ.

ప్రమాదం జరిగినపుడు విండో సీట్లో కూర్చున్న వారిపై బయటి నుంచి..

చివరి (ఐల్) సీట్లో కూర్చున్న వారిపై విమానం లోపలి నుంచి ముందుగా ప్రభావం పడుతుంది.

విమానంలోని మధ్య సీట్లు అన్నింటికీ ఇది వర్తించదు.

విమానంలోని వెనక వరుసల్లోని మధ్య సీట్లలో కూర్చోవడం భద్రతాపరంగా బెస్ట్.

విమానం రెక్కల ప్రాంతంలో ఇంధనం ఉంటుంది.

అందువల్ల ఆ ప్రాంతంలోని ఏ సీట్లలో కూర్చున్నా సేఫ్ కాదన్న నిపుణులు. 

ఎమర్జెన్సీ డోర్ దగ్గర్లో కూర్చోవడం వల్ల..

ప్రమాదాలు జరిగినపుడు తొందరగా బయటపడే వీలుంటుంది. 

విమానం ముందు వరుసల్లోని సీట్లతో పోలిస్తే వెనక వరుసల్లోని సీట్లే సేఫ్.