తెల్ల జుట్టును నల్లగా మార్చే చిట్కా

తెల్లని వెంట్రుకలు నల్లగా మారాలంటే జుట్టుకు రంగు వేయడమే మార్గమని అనుకోకండి.

హార్మోన్ సమస్యల వల్ల చిన్న వయస్సులోనే జుట్టు రంగు మారిపోతుంది.

కెమికల్స్ ఏవీ వాడకుండా ఇంట్లో రెమెడీ వాడి జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.

బాలనెరుపు వల్ల వచ్చే జుట్టు తెలుపు పోగొట్టుకోవచ్చు.

కాలేయ సమస్యలతో పాటు పని, పర్సనల్ లైఫ్‌లో ఒత్తిడుల వల్ల జుట్టు తెల్లగా మారుతుంది.

దీనికి చక్కటి పరిష్కారం ఉందట.

నల్ల జీలకర్రను ఆవాల నూనె లేదా కొబ్బరి నూనెలో రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే కాస్త వేడి చేసి తలకు పట్టించండి.

అలా కొద్ది గంటల పాటు ఉంచితే మంచిది.

సరిపడ నీరు తాగడం, చక్కటి నిద్ర, ఒత్తిడికి దూరంగా ఉంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.

ఈ సమాచారం కేవలం ఇంటర్నెట్‌లో కథనాల ఆధారంగా రూపొందించబడింది మాత్రమే.