ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశాకు చెందిన ఎస్టీ మహిళ ద్రౌపదీ ముర్మూ ఎంపికయ్యారు.

అధికార పార్టీ తరఫున రాష్ట్రపతి పదవికి పోటీ పడుతున్న రెండో మహిళ ముర్మూ

ద్రౌపది ముర్మూ 1958 జూన్‌ 20న బైదపొసి గ్రామం మయూర్‌భంజ్‌ జిల్లా, ఒడిశా రాష్ట్రంలో జన్మించారు.

ఆమె తండ్రి పేరు బిరించి నారాయణ్‌ తుడు, భర్త శ్యామ్‌చరణ్‌ ముర్మూ (మృతిచెందారు), ఇద్దరు కుమారులు (మృతిచెందారు), ఒక కుమార్తె ఇతిశ్రీ ముర్మూ ఉన్నారు.

ద్రౌపది ముర్మూ రమాదేవి మహిళా కళాశాల, భువనేశ్వర్‌లో బీఏ విద్యను అభ్యసించారు.

1979-1983 మధ్యకాలంలో నీటి పారుదల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా, 1994-1997 మధ్య కాలంలో రాయ్‌రంగ్‌పూర్‌లోని శ్రీఅరబిందో ఇంటెగ్రల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్‌లో అసిస్టెంట్‌ టీచర్‌గా పనిచేశారు

1997 సంవత్సరంలో భాజపాలో రాజకీయ అరగ్రేటం చేశారు. రాయ్‌రంగ్‌పుర్‌ కౌన్సిలర్‌, వైస్‌ ఛైర్మన్‌గా పనిచేశారు.

2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2000-2002 వరకు ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రి  పనిచేశారు

2002-2004 మధ్యకాలంలో ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రి పనిచేశారు. 2004లో రాయ్‌రంగ్‌పుర్‌ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నికయ్యారు.

2002-2009 వరకు మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలుగా, 2006-2009 వరకు ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా పనిచేశారు.

2010 -2015 మధ్య కాలంలో మయూర్‌భంజ్‌ జిల్లా భాజపా అధ్యక్షురాలిగా పనిచేశారు.

2015 సవత్సరంలో ఝార్ఖండ్‌ గవర్నర్‌గా నియామకమయ్యారు.