డివైడర్ల మధ్యలో చెట్లు ఎందుకో తెలుసా?

హైవేలపై ప్రయాణించేటప్పుడు ఎక్కడ చూసినా డివైడర్ల మధ్యలో చెట్లు కనిపిస్తాయి. 

కొన్ని చోట్ల పూల మొక్కలు నాటితే మరికొన్ని చోట్ల షో మొక్కలు నాటుతుంటారు. 

ఇంతకీ వీటిని ఎందుకు నాటుతారో తెలుసా..? 

కేవలం కాలుష్యాన్ని తగ్గించడానికి, రోడ్లు అందంగా కనిపించడానికి అనుకుంటే మీరు పొరబడినట్లే. 

సాధారణంగా హైవేలపై వాహనాలు వేగంగా వెళ్తుంటాయి. 

ఇక రాత్రి సమయాల్లో అయితే వాహనాల హెడ్ లైట్స్ హై బీమ్ ఉంటాయి. 

దీంతో వెళ్తున్న వాహనానికి ఎదురుగా వచ్చే వాహనం గ్లాస్ పై దీని లైటింగ్ పడే అవకాశముంది. 

ఫలితంగా డ్రైవర్ కి రోడ్డు సరిగా కనిపించకపోగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలెక్కువ. 

అటువంటి పరిస్థితులను నివారించడానికి మొక్కలను నాటుతారు.

అంతేకాదు, చుట్టూ ఉన్న పచ్చదనం వల్ల డ్రైవర్ కు చిరాకు అనిపించకుండా ఉంటుంది.

చెట్లు శబ్దాన్ని కూడా గ్రహిస్తాయట. ఫలితంగా శబ్ద కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. 

అందుకోసమే డివైడర్లపై మొక్కలు నాటుతారు.