న్యూస్ పేపర్‌పై ఈ 4 రంగుల చుక్కలెందుకు?
న్యూస్ పేపర్ గమనించారా?
న్యూస్ పేపర్ చివరలో నాలుగు రంగులు కనిపిస్తాయి.
అవి ఎందుకు ప్రింట్ చేస్తా తెలుసా?
ప్రతీ పేజీలో బ్లూ, పింక్, ఎల్లో, బ్లాక్ కలర్స్ కనిపిస్తాయి.
ఈ నాలుగు రంగులను CMYK అంటారు.
ఇందులో ఒక్కో లెటర్ ఒక్కో కలర్ ను సూచిస్తుంది.
C అంటే సియాన్(నీలం)
M అంటే మెజెంటా(పింక్)
Y అంటే ఎల్లో
K అంటే బ్లాక్.
అలా వాటిని ప్రింట్ చేయడం వెనుక ఒక కారణం ఉంది.
ప్రింట్ అయిన ప్రతి పేపర్‌ను ఓపెన్ చేసి సరిగ్గా ప్రింట్ అయ్యిందా? లేదా? అని చూడలేరు.
అందుకే పేపర్ చివర CMYK రంగులను ప్రింట్ చేస్తారు.
ఒకవేళ ఈ 4 రంగులు సరిగా ప్రింట్ కాకుండా బ్లర్ వస్తే వెంటనే కలర్ ప్లేట్స్ సెట్ చేసి మళ్లీ ప్రింటింగ్ స్టార్ట్ చేస్తారు.